నేనంటే నేను అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు...

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బలం పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం తరచూ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ అభివృద్ధిపై చర్చలు జరుపుతుంది. కానీ పార్టీ ముఖ్య నాయకులు మాత్రం ఆ సీటు నాది, ఈ సీటు నాది అని ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా అని ప్రకటన చేసాడు. సహజంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంటుంది. ఆ తరువాత బీఫార్మ్ ఇస్తేనే పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇందిరా భవన్ లో జరిగిన నగర పార్టీ సమావేశంలో ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత ,మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ మధ్య సికింద్రాబాద్ సీటు విషయంలో రసాభాస చోటుచేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ జోక్యంతో గొడవ సద్దుమనిగింది. ఇలా ఎవరికి వారు సొంత ప్రకటనలు చేసుకోటం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu