తెలంగాణ భవన్ ప్రవేశ పద్ధతిలో రానున్న కొత్త మార్పులు...
posted on Oct 5, 2019 11:11AM

రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మార్పులు చేశారు.తెలంగాణ భవన్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం భవన్ లో ఇప్పుడు మార్పులూ చేర్పులూ జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ ఎంట్రన్స్ గేటు నుంచి బ్యాక్ గేటు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలగిస్తున్నారు. కొత్త రోడ్డు నిర్మాణంతో పాటు జనరల్ ఎంట్రన్స్ గేటు నుంచి మార్చేందుకు శ్రీకారం చుట్టారు. మెయిన్ గేటు నుంచి జనరల్ పబ్లిక్ కు ఇక నుంచి అనుమతిని నిరాకరిస్తున్నారు. కేవలం పార్టీ పెద్దలు మాత్రమే మెయిన్ గేటు ఉపయోగించేలా మార్పులు చేస్తున్నారు. కొత్తగా మరో గేటు ఏర్పాటు చేసి రెగ్యులర్ గా వచ్చే వాళ్ల కోసం ఉపయోగించనున్నారని తెలుస్తోంది. భవన్ ఆధునీకరించడంతో పాటు చాంబర్ లను కూడా పెంచారు.ఎంపీ ఎన్నికల తర్వాత మార్పులను చేపట్టారు.
దీంతో మున్సిపల్ ఎన్నిక లు దగ్గర పడుతున్న వేళ ఈ మార్పులు చేయడం చూస్తోంటే వాస్తు సంబంధించిన మార్పుడి అయ్యి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. చాలా ఏళ్లు గా ఉన్న ఈ రోడ్డును తీసి కొత్త రోడ్లు వేస్తుండటంతో పాటు భవన్ లో కూడా కొన్ని మార్పులు చేస్తారని సమాచారం. ఈ మార్పులు చూసిన వారు వాస్తు మార్పులు అని అంటున్నారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ మాటలను కొట్టిపాడేస్తూ సాధారణ మార్పులే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పార్టీ మీటింగుల టైంలో సీఎం మంత్రులు ఇతర నేతలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందు లు ఎదురవుతున్నాయని, తెలంగాణ భవనం ఎదుటే కార్యకర్తలూ మీడియా ఉండిపోవాల్సి వస్తోందని కొందరు నేతలు పేర్కొంటున్నారు. దీంతో గేట్లు మార్చి రోడ్డు వెడల్పు చేస్తే నేతల కార్లు ఫ్రీగా తిరిగే అవకాశం ఉందని, కార్యకర్తలు ఇబ్బందులు పడే అవకాశం లేదని టీఆర్ ఎస్ భవన్ వర్గాల్లో వస్తున్న కధనాలు. ఇది వాస్తు మార్పిడినా లేక నిజంగా కార్యకర్తలు ఇబ్బందులు గుర్తించిన విషయమో తేలాల్సి ఉంది.