అఖిల పక్షానికి టిడిపి తరపున దేవేందర్, యనమల ?

 

 

 

ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి తెలుగు దేశం పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడు దేవేందర్ గౌడ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లను పంపించాలని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పాద యాత్రలో బాబు గౌడ్ ను పిలిపించుకొని మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ తరపున హాజరయ్యేందుకు సిద్దంగా ఉండాలని బాబు గౌడ్ కు సూచించినట్లు సమాచారం.

 

కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేందుకు ఈ సమావేశంలో తెలంగాణా కు అనుకూల వైఖరి అవలంభించాలని బాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ విజయావకాశాలఫై బాబు కు పెద్దగా నమ్మకాలు లేవని, తెలంగాణాకు అనుకూల వైఖరి అవలంబిస్తే, కనీసం ఆ ప్రాంతంలోనైనా పార్టీ విజయం సాధిస్తుందనేది బాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu