సమైక్యాంధ్ర కోసం త్యాగానికైన సిద్దం

 

telangana, united andhra pradesh, ysr congress tdp

 

 

సీమాంధ్ర నేతలు తమ పార్టీలన్నీ పక్కనబెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రం ముక్కలవుతుంటే తెలుగు వారి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు. అవసరమైతే యూపీఏ అధ్యక్షురాలు సోనియా నివాసం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంచాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu