తెలంగాణలో కరోనా కలకలం..పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి.  రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.  మీడియాతో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు.

కోవిడ్ నియంత్రణలో ఉందని కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండ్‌మిక్ స్టేజ్‌కి వచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రకటించింది. ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిందే. వృద్ధులు, కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయి’’ అని రవీందర్‌ నాయక్‌ వివరించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu