ఉదయ్ కిరణ్ ని తొక్కేశారా?..మీకే తెలుసు: తేజ
posted on Jan 6, 2014 3:22PM

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై అతని గురువు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీలో తొక్కేశారా అని ఆయన్ని ప్రశ్నంచగా.. ఈ విషయం తనకంటే మీడియాకే బాగా తెలుసు అని ఆయన నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ఉదయ్ కిరణ్ మరణవార్తను నమ్మలేకపోయాని, ఇది కాదు అనిపిస్తే బాగుండేదని దర్శకుడు తేజ అన్నారు. ఉదయ్ మరణవార్తను స్నేహితులు ఫోన్ చేసి చెప్పడంతో షాక్ గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. సినిమాలు లేకపోవడం వల్ల డిప్రెషన్‌లో ఉన్నాడన్నారు. తనవల్ల సినిమాల్లో పైకి వచ్చిన వ్యక్తి ఇలా చనిపోవడం బాధాకరమన్నారు. ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని, తనకు ఎన్ని సమస్యలు తలెత్తినా ఎవరినీ దూషించలేదని తెలిపారు. ఉదయ్ కిరణ్ మరణం చాలా బాధించిందని తేజ చెప్పారు.