మరో విమానంలో సాంకేతిక లోపం

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

తాజాగా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు రావలసిన థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యను విమానం టేకాఫ్ కు ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతికలోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఆ విమాన ప్రయాణీకులను బ్యాంకాక్ ఎయిర్ పోర్టులోనే దింపేశారు.