కోటి దాటిన తెలుగుదేశం సభ్యత్వాలు
posted on Jan 16, 2025 10:23AM

తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సంక్రాంతి పండుగ వేళ పార్టీ సభ్యత్వాలు కోటి దాటాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. కనుమ పండుగ రోజు నాటికి తెలుగుదేశం సభ్యత్వాల సంఖ్య కోటీ 20 వేల 65కు చేరుకుందని పార్టీ ప్రకటించింది.
కాగా లక్షా 49 వేల సభ్యత్వాలతో మంత్రి పొంగూరు నారాయణ నియోజకవర్గం నెల్లూరు సిటీ నిలిచింది. ఆ తరువాత వరుసగా రెండు మూడు స్థానాలలో మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడుల నియోజకవర్గాలు ఆత్మకూరు, పాలకొల్లు నిలిచాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబడు సొంత నియోజకవర్గం కుప్పం 1.38లక్షల సభ్యత్వాలతో ఐదో స్థానంలో నిలవగా, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి తొమ్మిదో స్థానంలో నిలిచింది.