విజయవాడలో సభపెట్టి తిట్టడం తప్ప ఏం చేస్తారు?
posted on Nov 3, 2014 1:18PM

విజయవాడలో సభ పెట్టి చంద్రబాబు నాయుడి పరిపాలనని ఎండగడతానని, అక్కడి రైతులకు మద్దతుగా నిలుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చేసిన కామెంట్ల మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ విజయవాడలో సభ పెట్టి ఏం చేస్తారని, నాలుగు తిట్లు తిట్టడం తప్ప చేసేదేమీ లేదని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌శాఖకు కార్లు కొనడం తప్ప ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించింది లేదు అని ఆయన విమర్శించారు. ‘‘ఏపీ పథకాలను కేసీఆర్ అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విద్యుత్ తీసుకురావడం సులభం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి లైన్లు రావు. తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఆ విద్యుత్‌ను ఎక్కడి నుంచి తీసుకువస్తారు?’’ అన్నారు.