పార్టీలో చేరకుండానే.. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది

 

టీడీపీ చివరి విడతగా మిగిలిన 36 అసెంబ్లీ స్థానాలతో సహా, మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టిక్కెట్లు దక్కలేదు. వారి స్థానంలో వేరే వారికి అవకాశం ఇచ్చారు. కర్నూల్ జిల్లా నుంచి భూమా కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు దక్కాయి. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగనున్నారు. కొద్దిరోజుల క్రితం భూమా కుటుంబానికి ఒకే టికెట్ వస్తుంది, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డికి టికెట్ కష్టమే అని ప్రచారం జరిగింది. అయితే టీడీపీ బ్రహ్మానందరెడ్డికే టికెట్ కేటాయించింది. ఇక భీమిలి టికెట్ గత కొంతకాలంగా టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న సబ్బం హరికి కేటాయించారు. అయితే ఆయన ఇంకా టీడీపీలో చేరకుండానే టికెట్ కేటాయించడం విశేషం.

ఇక ఎంపీ టికెట్ల విషయానికి వస్తే.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ నిర్ణయించింది. ఊహించినట్లుగానే విశాఖ ఎంపీ టికెట్ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ కి దక్కింది. రాజమండ్రి నుంచి మురళీమోహన్ పోటీకి దూరంగా ఉండడంతో ఆయన కోడలు రూపకు అవకాశం దక్కింది.

లోక్ సభ అభ్యర్థుల జాబితా:

1. శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు

2. విజయనగరం- అశోక్‌ గజపతిరాజు

3. అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌

4. విశాఖ- భరత్‌

5. అనకాపల్లి- ఆడారి ఆనంద్‌

6. కాకినాడ- చలమలశెట్టి సునీల్‌

7. అమలాపురం- గంటి హరీష్‌

8. రాజమండ్రి- మాగంటి రూప

9. నర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు

10. ఏలూరు- మాగంటి బాబు

11. విజయవాడ- కేశినేని నాని

12. మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ

13. గుంటూరు- గల్లా జయదేవ్‌

14. నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు

15. బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి

16. ఒంగోలు- శిద్దా రాఘవరావు

17. నెల్లూరు- బీదా మస్తాన్‌రావు

18. కడప- ఆది నారాయణరెడ్డి

19. హిందూపురం- నిమ్మల కిష్టప్ప

20. అనంతపుం- జేసీ పవన్‌రెడ్డి

21. నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి

22. కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

23. రాజంపేట- డీకే సత్యప్రభ

24. తిరుపతి- పనబాక లక్ష్మి

25. చిత్తూరు- శివప్రసాద్‌