జగన్‌ను నమ్ముకుంటే  జైలే! పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో  కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ రఘురామను కొట్టినందుకు సీబీఐ విచారణ ఎదుర్కుంటోందని అన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఏమాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను నమ్మకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు చంద్రబాబు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు.

బీసీ జనార్ధన్‌రెడ్డి చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్‌రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించారన్నారు. జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని బాబు నిలదీశారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని, జగన్‌ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు..జ‌నార్దన్‌రెడ్డి కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎలా వ‌ర్తిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారుయ టీడీపీ నేత అనుచ‌రుల‌ను పోలీస్ స్టేష‌న్‌లో పెట్టి కొట్ట‌డం నేరం.. టీడీపీ నేత‌ల‌ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. 

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ దాడులు మొద‌ల‌య్యాయ‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుల‌కే ప్రాధాన్యం ఇస్తోంద‌ని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చాక కొత్త రాజకీయాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. అక్ర‌మ అరెస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పుడు కేసుల‌ను ఉప‌సంహ‌రించుకొని తమ పార్టీ నేత‌ల‌ను విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. 

టీడీపీ మ‌హానాడును ఈ సారి కూడా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. 'స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.
 
'మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే '#DigitalMahanadu2021'లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. 'డిజిటల్ మహానాడు 2021'ను విజయవంతం చేయండి' అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News