ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి

తారకరత్న మెలెనా అనే అరుదైన రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నట్టు అంతకుముందు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో అంతర్గత రక్తస్రావం జరిగిందదని, జీర్ణాశయ అంతర్భాగంలో రక్తస్రావంగా పేర్కొనే అరుదైన మెలెనా వ్యాధితో ఆయన బాధపడుతున్నారని వివరించారు.  

దీని కారణంగా   గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ,   రక్తపోటును అదుపులో ఉంచాల్సి వస్తుంది. అయితే తారకరత్న  చికిత్సకు స్పందిస్తున్నారనీ, అది చాలా మంచి సింప్టమ్ అని వైద్యులు తెలిపారు.  నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న శుక్రవారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

బెలూన్‌ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నందమూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఆ  జూనియర్ ఎన్టీఆర్ వీలేకరులతో మాట్లాడుతూ.. తారకరత్న పూర్తిగా కోలుకుని త్వరలో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ, చికిత్సకు స్పందిస్తుండటంతో కోలుకుంటారన్న విశ్వాసం ఉందని అన్నారు.