పోలీసుల అత్యుత్సాహం.. కుటుంబాన్ని చితకబాదిన వైనం..
posted on Jul 12, 2016 12:36PM

ఒక్కోసారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించి చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు అలా అత్యుత్సాహం ప్రదర్శించే బదిలీ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల ప్రకారం.. రాజా(45), ఉష(40) దంపతులు తమ కుమారుడు సూర్య(18)తో కలిసి బంగారు దుకాణానికి వెళ్లి బయటకు వస్తుండగా... ఏదో విషయంలో వారిలో వారు గొడవపడుతున్నారు. అయితే ఇది గమనించిన పోలీసులు కల్పించుకొని వారిపై దురుసుగా ప్రవర్తించారు. తాము ఒకే కుటుంబమని.. చిన్న గొడవ మాత్రమే అని చెబుతున్నా వినకుండా.. ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. రాజా, ఉష, సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు కుటుంబంపై విరుచుకుపడ్డ పోలీసులని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.