బతికే వున్నా... మనోరమ
posted on Feb 16, 2015 11:50AM

తాను చనిపోయినట్టు వచ్చిన పుకార్లను సీనియర్ నటి మనోరమ ఖండించారు. సోమవారం నాడు మనోరమ మరణించారంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే మనోరమ నిక్షేపంలా వున్నారు. తాను బతికే ఉన్నానని ఆమె మీడియాకి వివరణ ఇచ్చారు. తాను బతికే వున్నానని తానే చెప్పుకునే పరిస్థితి రావడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. మనోరమ తరఫున ఆమె కుమారుడు భూపతి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తెలిపిన ప్రకారం... మనోరమ కొద్ది రోజుల క్రితం బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు. దాంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. అలాగే మూత్ర నాళానికి సంబంధించిన అనారోగ్య సమస్య కూడా ఆమెకు వుంది. వీటికి చికిత్స పొందడానికి ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొంది పరిస్థితి మెరుగు కావడంతో ఇంటికి చేరుకున్నారు. ఇదీ మనోరమ ప్రకటన సారాంశం.