ఈ 'చిన్నమ్మ'ను గుర్తుపెట్టుకోవాలి: సుష్మా

 

 

 

తెలంగాణ బిల్లు ఎప్పుడు తెచ్చినా మద్దతిస్తామని చెప్పాం...ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బిజెపి నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అలాంటి వారి స్వప్నాలు నేరవేరే బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం? అని ప్రశ్నించారు. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మను గుర్తుచేసుకోనేటప్పుడు..ఈ చిన్నమ్మ చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని లోక్ సభలో వ్యాఖ్యానించారు.

 

హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వల్ల తెలంగాణకు లాభమేనని, అదే సమయంలో సీమాంధ్రకు వచ్చే నష్టాన్ని ఎలా పూరిస్తారని సుష్మ ప్రశ్నించారు. కేవలం హామీలతో లాభం లేదని, ఎంత మొత్తం కేటాయిస్తారో ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఏర్పాటు చేసే కీలకమైన సంస్థలన్నిటికీ ప్రణాళికా సంఘం అనుమతి ఇప్పించాలని, ఈ తాత్కాలిక బడ్జెట్‌లోనే కొంత మొత్తాన్ని కేటాయించాలని ఆమె కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu