చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 

ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు.

గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు. 

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే.

పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.