వరవరరావుకు సుప్రీ కోర్టులో భారీ ఊరట.. శాశ్వత బెయిలు మంజూరు

విప్లవ రచయత వరవరరావుకు సుప్రీం కోర్టు శాశ్వత బెయిలు మంజూరు చేసింది. అయితే ఆయన గ్రేటర్ ముంబై దాటి వెళ్ల కూడదని షరతు విధించింది.  కేసు దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకూడదనీ, సాక్షులతో సంప్రదింపులు జరపరాదనీ ఆంక్షలు విధించింది.

వయోభారం, అనారోగ్యం కారణంగా తనకు పర్మినెంట్ బెయిలు మంజూరు చేయాలన్న వరవర రావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు వరవరరావుకు అంతకు ముందు ఇచ్చిన ఆరు నెలల బెయిలు కాలపరిమితిని ఎత్తివేసి శాశ్వత బెయిలు మంజూరు చేసింది.

కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగ ఉన్న వరవరరావును ఎన్ఐఏ 2018 అగస్టు 28న అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆయనతో పాటు మరో 16 మందిని కూడా ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరందరిపై కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారన్న అభియోగాలు మోపింది.