చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్?
posted on Jun 7, 2024 3:44PM
ఈనెల 12న జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు... ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్. రజనీకాంత్‌కి చంద్రబాబు నాయుడు అంతే ఎంతో అభిమానం. ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం. చంద్రబాబు నాయుడుకు వున్న చాలా తక్కువమంది మనసుకు దగ్గరైన మిత్రులలో రజనీకాంత్ ఒకరు. ప్రతి ఏడాది రజనీకాంత్ పుట్టినరోజుకు చంద్రబాబు తప్పనిసరిగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం విజయవాడలో జరిగినప్పుడు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విషయం తెలిసింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను ఆ సందర్భంలో రజనీకాంత్ వ్యక్తం చేశారు. అప్పుడు జగన్ కేబినెట్‌లో వున్న ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని తదితరులు గ్రామసింహాల్లాగా రజనీకాంత్ మీద విరుచుకుపడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పాపం రజనీకాంత్ జగన్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా ఈ మూకలు ఆయన్ని తిట్టిపోశాయి. వీళ్ళందరికీ ఆయన ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఇన్‌డైరెక్ట్.గా పంచ్‌లు ఇచ్చారు.
ఇదంతా అలా వుంచితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం రజనీకాంత్‌కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న అంశం. దాంతో ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు అందరూ రజనీకాంత్ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కో్రుకుంటున్నారు. అభిజ్ఞవర్గాల కథనం ప్రకారం, రజనీకాంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తారని తెలుస్తోంది.