సన్నీ.. సన్నీ.. గూగుల్‌లో సన్నీ జపం

ఐటెం సాంగ్‌లతో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌గా మారిన సన్నిలియోన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై సూపర్‌ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడామె ఎక్కడుంటే అక్కడ జనం పొటేత్తుతున్నారు. అలా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎంతమంది స్టార్లు ఉన్నా సన్నీకున్న ఆకర్షణే ప్రత్యేకం. ఆమె ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేసేందంటే చాలు ఆ మూవీకి కాసుల వర్షమే. అలా నిర్మాతల పాలిట అదృష్టదేవతలా మారింది సన్నీ. మరి అలాంటి సెలబ్రెటీ గురించి తెలుసుకోవాలని జనం అనుకోకుండా ఉంటారా..అందుకే ఆమె సినిమాలు, వ్యక్తిగత సమాచారం పట్ల భారతీయ యువత ఎంతో ఆసక్తిగా చూపుతోంది. సోషల్ మీడియా, యూట్యూబ్, గూగుల్ ఇలా ఎక్కడ దొరికితే అక్కడ సన్నీలియోన్ పేరును వెతికేస్తున్నారు. దీంతో ఆమె పేరిట ఓ రికార్డు నమోదైంది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది శోధించిన వ్యక్తుల జాబితాలో సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కాగా, బాలీవుడ్ భామ దిశా పటానీ ఐదో స్థానంలో నిలిచింది.