సుమంత్ హీరోగా సుకుమార్ సినిమా

 

మహేష్ హీరోగా "1-నేనొక్కడినే" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుకుమార్ త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సుమంత్ అశ్విన్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన వేమారెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం మహేష్ చిత్రంతో బిజీగా ఉన్న సుకుమార్, ఈ చిత్రం తర్వాత సుమంత్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుసుకుందాం.