స్వామి కన్ను ఇప్పుడు టీడీపీపై పడిందా..?

 

నిన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు, ఆర్ధిక వేత్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు టీడీపీపై కూడా ఆయన కన్ను పడినట్టుంది. ఏపీలోని పుణ్య కేత్రమైన తిరుమల నేపథ్యంలో ఆయన టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని.. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


కాగా ఎప్పుడూ కాంగ్రెస్ పై ఏదో ఒక ఆరోపణలు చేసి వారిని ఇరుకున పెట్టే సుబ్రహ్మణ్యస్వామి.. ఆ తరువాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను టార్గెట్ చేశారు. ఆ తరువాత.. కేంద్ర ఆర్ధిక సలహాదారు.. అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేశాడు. అది అయిపోయిందనుకుంటే.. విదేశీ యాత్రలు చేసే మంత్రుల డ్రస్సింగ్ గురించి ట్విట్టర్లో కామెంట్లు విసిరి దుమారం రేపారు. మళ్లీ ఇప్పుడు తాజాగా ఆయన కన్ను ఏపీలోని టీడీపీ పై పడింది మరి దీనిపై ఎంత రగడ చేస్తారో.. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.