జంజీర్, తూఫాన్ ట్రైలర్స్ నిలిపివేయాలి బాంబే కోర్టు
posted on Mar 28, 2013 8:59AM
.png)
రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటి బాలీవుడ్ సినిమా జంజీర్ దీని తెలుగు అనువాదం తుఫాన్ ట్రైలర్స్ ప్రసారం చేయకూడదని బాంబే హై కోర్టు ఆర్డర్లు జారీ చేసింది. 1973 లో అమితాబ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దివంగత ప్రకాష్ మెహ్రా నిర్మించారు. ప్రకాష్ మెహ్రా కు ముగ్గురు కుమారులు అమిత్ మెహ్రా, పునీత్ మెహ్రా, సుమీత్ మెహ్రా. జంజీర్ రిమేక్ విషయంలో వీరి నడుమ వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే పునీత్, సుమీత్ మెహ్రాలు ఈ చిత్ర రిమేక్ హక్కులను అమిత్ మెహ్రాకు అమ్మారు. అయితే అమిత్ మెహ్రా వీరిద్దరికీ డబ్బు చెల్లించడం లేదు. దీంతో పునీత్ మెహ్రా, సుమీత్ మెహ్రాలు బాంబే హైకోర్టులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్, ట్రైలర్స్, హిందీలోగాని, తెలుగులోగాని నిలిపివేయాలని అప్పీలు చేసింది. దీంతో బాంబే హైకోర్టు బుధవారం ఈ చిత్ర ట్రైలర్స్ పై ప్రసారాన్ని నిలిపివేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.