శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. బీజేపీ ఓడిపోతే శ్రీరాముడికి ఏమౌతుంది?

శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్  చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పంద్రాగస్టు లోగా రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి మోసానికి య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.  చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. 93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి అని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కోరారు. ర్యాలీలో ఆయ‌న  మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు.

రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బిజెపికి తెలుసనీ.. మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెప్పాలని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. పదే పదే బండి సంజయ్ మోడీ దేవుడంటూ చెప్పుకొస్తాడు..అసలు మోడీ దేవుడు ఎలా అవుతాడు. సిలిండ‌ర్ ధ‌ర పెంచినందుకు అవుతాడా.. ? పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచినందుకు అవుతాడా..? నిత్యా అవసర ధరలు పెంచినందుకు అవుతాడా.? తెలంగాణ కు ఎలాంటి హోదాలు ఇవ్వనందుకు అవుతాడా..? ఎలా అవుతాడని కేటీఆర్ ప్రశ్నించారు.  10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని కేటీఆర్ అన్నారు.  ఏమ‌న్న అంటే జైశ్రీరాం త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ, పాఠ‌శాల ఇవ్వ‌లేదు. గుడికి పైస‌లు ఇవ్వ‌లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై  కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.   

చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థిగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఓట‌మి త‌రువాత విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.

కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు. ఇక బీఆరెస్ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్ అండ‌తో చేవెళ్ళ‌లో భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని కాసాని చెబుతున్నారు. త‌ను లోక‌ల్ అభ్య‌ర్థి అని ఆయ‌న చెబుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు కాసాని. ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. ఇవ‌న్ని త‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌నే కాసానికి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు కాసాని. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో పరిశ్ర‌మ‌ల్ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెచ్చింది. చేవెళ్ల‌ను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా త‌యారు చేసే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశారు.  షాబాద్‌లో వెల్‌స్ప‌న్ ఫ్యాక్ట‌రీ తెచ్చుకున్నాం. కైటెక్స్ ప‌రిశ్ర‌మ తెచ్చుకున్నాం. చంద‌న్‌వెల్లిలో అమెజాన్, ఈస్ట‌ర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్‌లో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం. విక‌రాబాద్, చేవెళ్ల, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు తేవ‌డానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల పెట్టుకున్నాం. ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ మ‌న కోస‌మే నిర్మించుకున్నామ‌ని చెబుతున్న బీఆర్ నేత కాసాని గెలుపుపై ధీమాగా వున్నారు.