స్పీడ్ న్యూస్ 2

కన్నాకు గన్ మెన్ లను తొలగించిన జగన్ సర్కార్

11. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు జగన్ ప్రభుత్వం గన్ మెన్ లను తొలగించింది.   గత 5 సంవత్సరాలుగా  కన్నాకు గన్ మెన్లుగా ఉన్న వారు గత మూడు రోజులుగా రాకపోవడవంతో విషయమేమిటని ఆరా తీస్తే వారిని తొలగించిన విషయం బయటపడింది. 

....................................................................................................................................................

తిరుమలలో భక్తుల రద్దీ

12.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్లు వచ్చింది.

...........................................................................................................................................

సీబీఐ డైరెక్టర్ కు అవినాష్ లేఖ

13. వివేకా హత్య కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్  చేసిన దర్యాప్తును పునస్సమీక్షించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు.  వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. 

.........................................................................................................................................................

మారథాన్ లో పాల్గొని గుండెపోటుతో యువకుడి మృతి

14. మారథాన్ పరుగులో పాల్గొన్న  20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో  మరణించిన ఘటన  మధురైలో  జరిగింది. ఆదివారం  జరిగినఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును పూర్తి చేసిన  బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు.

.......................................................................................................................................................

డీఐజీ సెల్ ఫోన్ చోరీ

15. ఏకంగా డీఐజీ సెల్ ఫోనే చోరీకి గురైంది. అసోం డీఐజీ  వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగలు ఆయన ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న మాజర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.  

.......................................................................................................................................................

తెలంగాణలో 40 మంది డీఎస్పీల బదలీలు

16. తెలంగాణలో బదలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా  40 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డీఐజీ అంజని కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర  ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే.

.................................................................................................................................................

టమాటాల వినియోగం మానేస్తే సరి!

17. టమాటాల ధరలు దిగివచ్చేందుకు ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు బ్రహ్మాండమైన చిట్కా చెప్పారు. ఆకాశన్నంటిన టమోటా ధరలు తగ్గుముఖం పట్టాలంటే జనం వాటిని తినడం మానేయాలని సలహా ఇచ్చారు. అలా చేస్తే ధరలు వాటంతట అవే దిగి వస్తాయని మంత్రి ప్రతిభా శుక్లా అన్నారు. 

.............................................................................................................................................

పొన్నంకు మద్దతుగా గాంధీ భవన్ వద్ద ఆందోళన

18.  కాంగ్రెస్లో కొందరు సీనియర్లు పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ ఆయన అనుచరులు గహైదరాబాద్ గాంధీభవన్ వద్ద నిరసనకు దిగారు.  ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు గాంధీ భవన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 

..............................................................................................................................................................

దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ

19. కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే  వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచే పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.  ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అని రేవంత్ రెడ్డి అన్నారు.

..........................................................................................................................................

పెన్ గంగ ఉధృతి.. తెలంగాణ, మహా రాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

20.  తెలంగాణ   వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  డొల్లార వ పెన్ గంగఉధృతంగా ప్రవహిస్తుండటంతో  ఎన్హెచ్ 44పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 

.............................................................................................................................................................

జ్ణానవాపి మసీదులో సర్వే

21.జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సోమవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సుప్రీం ఆదేశాల మేరకు సర్వే చేపట్టారు.

.......................................................................................................................................................

టమాటాలోడుతో వెడుతున్న లారీ హైజాక్

22. టమాటా ధరలు పెరగడంతో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగి చోరీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో రెండున్నర టన్నుల టమాటా లోడ్ తో వెళుతున్న లారీని కొందరు హైజాక్ చేశారు.  డ్రైవర్ ను కిందికి నెట్టేసి లారీతో ఉడాయించారు.

.....................................................................................................................................................

అహ్మదాబాద్ విమానాశ్రయం జలమయం

23. గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం జలమయమైపోయింది.  అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

.........................................................................................................................................................

సిటీ బస్సుల కోసం విజయవాడలో ఎదురు చూపులు

24. అమరావతిలో జగన్ సభ కోసం ఆర్టీసీ ఆధికారులు బస్సులను తరలించడంతో విజయవాడ ప్రజలు సిటీ బస్సులు అందుబాటులో లేక నానా యాతనలూ పడుతున్నారు. కనీసం సిటీ బస్సులు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నకు కూడా ఆర్టీసీ అధికారుల నుంచి సమాధానం కరవైంది.

........................................................................................................................................................

డేంజర్ మార్క్ దాటిన యమున

25.యమునా నది నీటిమట్టం  ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో   భారీవర్షాలతో  హత్నకుండ్ బ్యారేజీ నుంచి  వరదనీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్ కు చేరింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu