స్పీడ్ న్యూస్ 1

బంగాళాఖాతంలో తుపాను

1. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారి నేడు తుపానుగా అవతరించింది.  ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువగా కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండాని  సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతోంది.

...............................................................................................................................................................

హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్

2. హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణశాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ల పరిధిలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

....................................................................................................................................................

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వనమా

3. తాను ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాబలంతోనే కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పిన వనమావెంకటేశ్వరరావు తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానని అన్నారు.  న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

..........................................................................................................................................................

హోంమంత్రి పర్యటన సన్నాహకాలపై కిషన్ రెడ్డి సమావేశం

4. బీజేపీకి చెందిన వివిధ విభాగాల నేతలతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 29న  అమిత్ షా రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై చర్చ జరిగింది.

...........................................................................................................................................................

పాఠశాలలకు సెలవులు

5. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు సెలవులు ప్రకటించింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

.........................................................................................................................................................

ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటులో బిల్లు

6.  ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

..................................................................................................................................................

సొమ్మసిల్లి పడిపోయిన డీరాజా

7. మణిణిపూర్ పరిస్థితులను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ చెన్నైలో కేంద్రానికి వ్యతిరేకంగా నిన్నజరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ డి. రాజా సొమ్మసిల్లి పడిపోయారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా స్ఫృహతప్పి పడిపోయారు.

...............................................................................................................................................................

నెల్లూరు రూరల్ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా కోటంరెడ్డి

8. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించినట్లు  ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు తెలిపారు.  

................................................................................................................................................

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 23 సీట్లే: విష్ణుకుమార్ రాజు

9. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీకి వచ్చేవి కేవలం 23 సీట్లేనని  బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణుకుమార్ రాజు  అన్నారు. విశాఖపట్నంలో మీడియా మాట్లాడిన ఆయన మరో 8 నెలల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని చెప్పారు.

...............................................................................................................................................................

మేం ఇండియా: రాహుల్

10. విపక్ష కూటమి పేరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గట్టిగా బదులు ఇచ్చారు.  విపక్ష కూటమిపై మీరెంతగా నిప్పులు చెరిగినా పట్టించుకోం ఎందుకంటే మేం ఇండియా అని ట్వీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News