స్పీడ్ న్యూస్ 4

రోడ్ కం రైలు వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిషేధం

41. రాజమహేంద్రవరం లోని   రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను అధికారులు ఆదివారం నుంచి నిషేధించారు.  వంతెన దెబ్బ తిన్న నేపథ్యంలో  రోడ్లు, భవనాలశాఖ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిషేదం ఎంత కాలం అన్నది వెల్లడించలేదు.  

..........................................................................................................................................................

ఏపీలో దళితులపై దాడులు..తక్షణమే చర్చించాలి: ఎంపీ కనకమేడల

42.  ఏపీలో దళితులు, గిరిజనులపై దాడుల అంశాన్ని అత్యవసరంగా చర్చించాలంటూ రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర నోటీసు ఇచ్చారు.   ఏపీలో గిరిజనులు, దళితులపై దాడులు పెచ్చరిల్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

.....................................................................................................................................................

నాలుగు రైళ్లు రద్దు

43.సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా  ఈనెల 24 నుంచి 30 వరకు ర కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), హెచ్‌.ఎస్‌.నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌.ఎస్‌.నాందేడ్‌ (07853) రైళ్లను రద్దు చేస్తున్నట్లు   రైల్వే  శాఖ ప్రకటించింది.

...........................................................................................................................................................

ఏపీలో ప్రవేశించిన కొలికిపూడి యాత్ర

44. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకు చేపట్టిన పాదయాత్ర  ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆదివారం ఏపీలోకి ప్రవేశించింది.  

............................................................................................................................................................

మణిపూర్ హింసాకాండ వెనుక కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే

45. మణిపూర్‌లో చెలరేగుతున్న హింస వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర  బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు మోడీ తమకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. నగ్న వీడియో బయటపడకుంటే అసలాయన నోరిప్పేవారే కాదన్నారు.

.............................................................................................................................................

విజయసాయికి ప్రకాశం రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు: బాలినేని

46.  ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఎంపీ   విజయసాయిరెడ్డికి అప్పగించనున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.  నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రను   ఆపలేదని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న వాలంటీ ర్లను   విమర్శించడం సరికాదని చెప్పారు.

...................................................................................................................................................

కేసీఆర్ పాలన అవినీతి మయం: షర్మిల

47. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని షర్మిల ఆరోపించారు. తాను చెప్పింది కరెక్టు కాదనే ధైర్మం ఉందా అని సవాల్ చేశారు. నిజంగా అవినీతి రహిత పాలన సాగించి ఉంటే ఎన్నికలలో   సిట్టింగులకు టికెట్టివ్వాలని  షర్మిల కేసీఆర్ కు సవాల్ విసిరారు.

...........................................................................................................................................................

కేసీఆర్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: ప్రవీణ్ కుమార్

48. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో జరిగి బహుజన మహిళా సదస్సులో ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో అవినీతి పాలన అంతమొందించేందుకు అందరూ కష్టపడాలన్నారు. 

...................................................................................................................................................

49. సర్పంచ్ ల ఆందోళన కృష్ణా జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది.  స్పందన హాల్లో కలెక్టర్  ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో  సర్పంచులు లోపలకు వచ్చి నిరసన తెలియజేస్తూవేదిక ముందు బైఠాయించి నినాదాలు చేశారు.  పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

.........................................................................................................................................................

సత్యేంద్రజైన్ కు బెయిలు పొడగింపు

50. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సత్యేంద్ర జైన్ కు ఆరోగ్య కారణాలతో  మధ్యంతర బెయిలు లభించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతర బెయిల్‌ కొనసాగుతుందని కోర్టు తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu