స్పీకర్ నోటీసులకు కాపు రెస్పాన్స్ లేఖ
posted on Jan 30, 2012 2:26PM
హై
దరాబాద్: తాను విచారణకు హాజరు కానని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో స్పీకర్ ఫిబ్రవరి రెండో తేదిన హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఇందుకు ఆయన సోమవారం తాను హాజరు కానని స్పీకర్‌కు లేఖ ద్వారా రెస్పాన్స్ ఇచ్చారు. సిఎల్పీ చేసిన ఫిర్యాదులు, ప్రభుత్వం విప్ జారీ చేసిన నోటీసులు, సర్టిఫైడ్ కాపీలు తనకు పంపమని కోరినప్పటికీ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. సిఎల్పీ లేఖ తనకు అందలేదని చెప్పారు. కాబట్టి తాను హాజరు కానన్నారు. కాగా గత సంవత్సరం డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారిలో కాపు రామచంద్రా రెడ్డి ఒకరు.