మరోసారి ఉత్తరకొరియా దుశ్చర్య...

 

ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. అగ్ర దేశాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జపాన్‌ సముద్రంలోకి ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించి మరోసారి పొరుగుదేశాలకు ఆగ్రహం తెప్పించింది. 11.42 గంటల ప్రాంతంలో కేఎన్‌-15 మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందని, 11.51 గంటల సమయంలో అది జపాన్‌ సముద్ర జలాల్లో కూలిపోయిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరకొరియా చేస్తున్న పనులను అడ్డుకునేందుకు అమెరికా, చైనా సంయుక్తంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu