సఫారీల కింగ్ బవుమా.. ప్రపంచ క్రికెట్‌లో ట్రెండ్ సెట్టర్

 

బవుమా.. బవుమా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతున్న పేరిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో  బవుమా దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు.. బ్యాటర్‌గా సాగించిన పోరాటం గురించి అందరూ కొనియాడుతున్నారు. కానీ రెండేళ్ల ముందు అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం కోటా విధానం వల్లే బవుమాకు అవకాశం దక్కిందని.. ఆటగాడిగా కూడా జట్టులో ఉండడానికి అర్హత లేని వాడిని కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. బవుమా వైఫల్యం వల్ల జట్టు సమతూకమే దెబ్బ తింటోందనే చర్చ జరిగింది. 

కానీ నిరుడు ఫామ్‌ అందుకున్న అతను.. డబ్ల్యూటీసీలో నిలకడగా రాణించి జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఫైనల్లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే తొడకండరాలు పట్టేసి తీవ్రంగా ఇబ్బంది పడ్డా.. అలాగే బ్యాటింగ్‌ కొనసాగించాడు. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగితే జట్టుకు గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని.. నొప్పిని భరిస్తూ అసాధారణ పోరాటం సాగించాడు. ఏడాది ముందు వరకు బవుమాను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్‌ చేసిన వాళ్లే.. ఇప్పుడు అతడిని కొనియాడుతుండడం విశేషం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu