21 పరుగులు.. మూడు వికెట్లు...

 

వరల్డ్ కప్ క్రికెట్‌లో వింతలూ విడ్డూరాలూ బాగానే జరుగుతున్నాయి. ప్రపంచ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా మంగళవారం నాడు దక్షిణాఫ్రికా - ఐర్లండ్ మ్యాచ్‌లో ఒక వెరైటీ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 411 పరుగులు చేసింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లండ్ మ్యాచ్ ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 21 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ స్టెయిన్ తన బౌలింగ్‌తో ఐర్లండ్ జట్టు వెన్ను విరిచాడు. మొత్తానికి ఈ వరల్డ్ కప్‌లో దిగ్గజాల్లాంటి పెద్ద జట్లు కూనల్లాంటి చిన్న జట్లతో భలే ‘ఆడుకుంటున్నాయి’. పరుగుల సాధన, వికెట్లు తీయడంలో తమ ప్రతిభను బుజ్జి బుజ్జి జట్ల మీద బాగానే ప్రదర్శిస్తున్నాయి.