ఫ్యాలెస్‌లో సైకో చెవులు చిల్లులుపడేలా..‘మోత మోగిద్దాం’!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ.. వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టాలంటూ ప్రజలకు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. చంద్రబాబు నాయుడుగారికి మద్దతుగా మోత మోగిద్దాం పేరిట సెప్టెంబర్ 30వ తేదీ అంటే శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు ఫ్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా.. ఏదో ఓ రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపు నిచ్చింది. 

ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రజలకు టీడీపీ సూచించింది. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఇంట్లోనో.. ఆపీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా.. బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేకుంటే విజిల్ వేయండి. ఓ వేళ రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియలో షేర్ చేయండంటూ పోస్టర్‌లో స్పష్టం చేసింది. . 

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామన్నారు.  

మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ట్వీట్ చేశారు. చంద్రబాబు  మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేశారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబు పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్లకి చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా ఫర్వాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి అంటూ ప్రజలకు విజ్జప్తి చేశారు. 

మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ తనదైన శైలిలో స్పందించారు. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకి మద్దతుగా.. సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకోకి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి.. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంటూ.. ఆయన ప్రజలకు సూచించారు.   

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్  కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. ఆగస్ట్ 9వ తేదీన ఆయన్ని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలు చేపడుతుండగా.. బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ తదితర నగరాల్లో ఆందోళనలు కొనసాగుతోన్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, జర్మనీ, యూరప్ తదితర దేశాల్లో సైతం తెలుగు వారు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నారు.