వారెవా.. స్మార్ట్‌సిటీలో స్మార్ట్ లైబ్ర‌రీ అదుర్స్‌..

లైబ్ర‌రీ. గ్రంథాల‌యం అంటే ఎట్టా ఉంటాదో తెలుసుగా. ఏవో కొన్ని ప్ర‌ముఖ ప్రాంతాల్లో, ప్ర‌ముఖ గ్రంథాల‌యాలు మిన‌హా మిగ‌తా అన్నిటి దుస్థితి చెప్ప‌త‌రం కావు. పాత భ‌వ‌నాలు.. చీక‌టి గ‌దులు.. రంగులు వెల‌సిన గోడ‌లు.. విరిగిన కుర్చీలు.. అవిఇవి కొన్ని పుస్త‌కాలు. చాలాచోట్ల‌ లైబ్ర‌రీ అంటే చాలా మామూలుగా ఉంటుంది. పేరుకే గ్రంథాల‌యం.. గ్రంథాల మాటే ఉండ‌దు. కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ బుక్స్‌.. కొన్ని మ్యాగ్జిన్స్‌.. అన్నిర‌కాల‌ న్యూస్ పేప‌ర్స్‌. లైబ్ర‌రీ అంటే ఇంతే. అస‌లు సిటీలో లైబ్ర‌రీ ఎక్క‌డుందో కూడా చాలా మందికి తెలీదు. లైబ్ర‌రీకి వెళ్లేవారు.. బుక్స్ చ‌దివే వారు త‌క్కువే ఉంటారు. అయితే, అన్ని గ్రంథాల‌యాలు అలా కాదు. కొన్ని స‌ర‌స్వ‌తీ నిల‌యాలు అయితే.. మ‌రికొన్ని సంథింగ్ స్పెష‌ల్‌. ఆ కోవ‌లో చేరింది వరంగ‌ల్ రీజ‌న‌ల్ లైబ్ర‌రీ. 

వ‌రంగ‌ల్ న‌గ‌రం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక చేయ‌బ‌డింది. కేంద్రం భారీగానే నిధులు కుమ్మ‌రించింది. కొన్నేళ్లుగా వ‌రంగ‌ల్ సుంద‌రీక‌ర‌ణ‌, వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే.. వ‌రంగ‌ల్‌లో ఉన్న రీజ‌న‌ల్ లైబ్ర‌రీని ఇలా అందంగా తీర్చి దిద్దారు. అదిరిపోయేలా పెయింటింగ్ వేశారు. చూస్తే.. ఎవ‌రైనా అవాక్క‌వ్వాల్సిందే. 

లైబ్ర‌రీ బిల్డింగ్ బ‌య‌టి గోడ‌ల‌కు ఇలా పుస్త‌కాల బొమ్మ‌లు వేశారు. ఓ చిన్నారి కూర్చొని.. చేతిలో పుస్త‌కం ప‌ట్టుకొని చ‌దువుతున్న‌ట్టు పెయింటింగ్ వేశారు. ఆ పుస్త‌కాల చిత్రాలు సైతం చాలా ప‌క్కాగా గీశారు. నిజ‌మైన బుక్‌లో అక్ష‌రాలు, టైటిల్స్ ఎలా ఉంటాయో.. పెయింటింగ్‌లోనూ అచ్చం రియ‌ల్ బుక్ త‌ర‌హాలోనే డీటైల్డ్‌గా రంగులు వేశారు. లైబ్ర‌రీ బిల్డింగ్ గోడ‌ల చుట్టూ.. పుస్త‌కాల అర‌లు, అందులో బుక్స్ ఉన్న‌ట్టు చాలా చ‌క్క‌గా గీశారు. రాత్రి వేళ సైతం ఆ లైబ్ర‌రీ బిల్డింగ్‌, బుక్స్ పెయింటింగ్ అందంగా క‌నిపించేలా స్మార్ట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. 

వ‌రంగ‌ల్‌-హ‌న్మ‌కొండ మెయిన్‌రోడ్డుపై ఉండే ఈ లైబ్ర‌రీ బిల్డింగ్‌.. ఇప్పుడు అటువైపుగా వెళుతున్న వారంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తోంది. దాదాపు అర శ‌తాబ్దంగా లైబ్ర‌రీ ఉన్నా.. ఈనాటికి ఇక్క‌డో లైబ్ర‌రీ ఉన్న‌ట్టు అంద‌రికీ తెలిసొస్తోంది. సిటీలో ఇంత మంచి గ్రంథాల‌యం ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. లైబ్ర‌రీ బిల్డింగ్ ముందు సెల్ఫీలు దిగుతున్నారు. స్మార్ట్‌సిటీలో స్మార్ట్ లైబ్ర‌రీ.. ప‌బ్లిక్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. 

NOTE : తెలుగువ‌న్ వెబ్‌సైట్‌లో గ్రంథాల‌యం ఆప్ష‌న్ ఉంది. ఇందులో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ల ర‌చ‌న‌లు చాలా ఉన్నాయి. పుస్త‌క ప్రియులు, సాహిత్య అభిలాషులకు ఉప‌యుక్తంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న‌వారు ఒక‌సారి చెక్ చేయండి. 

https://www.teluguone.com/grandalayam/

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu