సీతారాం ఏచూరి కన్నుమూత 

సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి  (72) కన్నుమూశారు.  తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో గత నెల 19న ఎయిమ్స్‌లో చేరారు.  సీతారాం ఏచూరికి వైద్యుల బృందం చికిత్స అందిస్తూనే ఉన్నారు. అయితే గురువారం నుంచి ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. వైద్యుల సూచన మేరకు ఏచూరిని వెంటిలేటర్ పై ఉంచారు.  జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏచూరి ఎపిలోని కాకినాడవాసి. పుట్టింది మాత్రం చెన్నయ్ లో . చదువుకుంది మాత్రం హైదరాబాద్ లో. విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహసభల్లో ఐదో ప్రదానకార్యదర్శిగా ఎంపికయ్యారు.  కామ్రెడ్ రామచంద్రన్ పిళ్లై పోటీ నుంచి వైదొలగడంతో ఏచూరి పేరును ప్రకాశ్ కారత్ ప్రకటించారు. ఆయన వరుసగా మూడు సార్లు ప్రదానకార్యదర్శి పదవిలో కొనసాగారు. 


 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News