సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం..పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
posted on May 3, 2025 4:08PM

సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని ఓ ఇంటర్వ్యూలో ఖవాజాను మీడియా ప్రశ్నించింది. ఒక వేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాకిస్థాన్ ధ్వంసం చేస్తుందని బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఇండియాలో ఉన్న దాయాదులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసంది. అదేవిధంగా పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరుకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది.