నేతలల్లో ఆనందం నింపుతున్న శుభలేఖలు

గులాబీ పార్టీలో ఇప్పుడు ఆ శుభలేఖలు హాట్ టాపిక్ గా మారాయి. నేతల తలరాతలను ఆ శుభలేఖలు మారుస్తున్నాయి విషయానికి వస్తే ఆయన పేరు వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు పెళ్లి కోసం సీఎంను ఆహ్వానించడానికి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కూడా శుభవార్త అందింది. ఆ తర్వాత పిడమర్తి రవి కూడా ఇటీవల ప్రగతి భవన్ కు వెళ్లారు. తన పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించారు.ఇప్పుడు ఈ పెళ్లి విషయం కూడా ఈ నేతకు గుడ్ న్యూస్ అవబోతోందా అని టీఆర్ఎస్ నేతలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవి రెన్యువల్ కాలేదు. అయితే తన కొడుకు పెళ్లి కోసం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ప్రగతి భవన్ వెళ్ళారు. సిఎం కెసిఆర్ ని కలిసి శుభలేఖ ఇచ్చి పెళ్లికి రావాల్సిందిగా కోరారు. అయితే అక్కడే అద్భుతం జరిగింది.పెళ్లి కార్డు ఓపెన్ చేసి చూసినా కేసీఆర్ శాప్ చైర్మన్ హోదాలో నువ్వు ఆహ్వానించాలి అని అప్పటికప్పుడు అల్లిపురంకు ఒక పదవి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు కూడా జీవో ఇచ్చేశారు. దీంతో వెంకటేశ్వరెడ్డి ఆనందానికి అవదులు లేవు. పెళ్లికి పిలవడానికి వెళితే పదవి రెన్యువలైందని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అలాంటి అనుభవం ఏ ఎదురైయ్యింది.ఆయన తన కొడుకు ఎంగేజ్ మెంట్ కు సీఎం కేసీఆర్ ను పిలిచేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు. అదే హుజూర్ నగర్ గెలుపు గిఫ్ట్ ఆయనకు అందింది. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ జీవో రిలీజైంది. ఇప్పుడు ఇదే అనుభవం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవికి ఎదురైంది. తన పెళ్లి పత్రిక ఇచ్చేందుకు కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. ఆయన్ను తన పెళ్లికి ఆహ్వానించారు. దీంతో ఇప్పుడు ఈయన కూడా శుభవార్త అందుతుందని ఆయన అనుచరుడు వెయిటింగ్ లో ఉన్నారు. పిడమర్తి రవి కూడా పదవి రెన్యువల్ కోసం చాలా రోజులుగా వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు పిడమర్తి విషయంలో కూడా శుభలేఖ వర్కవుటైతే మిగితా వారు కూడా తమ కుటుంబంలో జరిగే శుభకార్యాల ఆహ్వాన పత్రికలు తీసుకొని పదవి రెన్యువల్ చేయించు కుంటారని గులాబిదళంలో గుసగుస నడుస్తోంది.