ఇక పై ప్రజల కొసమే అంటున్న ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఇతరత్రా కారణాల వల్ల ఆమెకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆమెను ఏపీఐఐసీ చైర్మన్ చేశారు సీఎం జగన్. అయితే ఇప్పుడు రోజా సరికొత్త టార్గెట్ ఒకటి పెట్టుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు. చివరి వరకు ఆమె ఓడిపోతారనే ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమె 2000 ల ఓట్ల బొటాబొటి మెజారిటీతో గెలిచారు. రోజాకు నియోజకవర్గంపై పట్టు లేదనే విమర్శలూ అపట్లో ఆమె పై వినిపించాయి. మెజార్టీ రాకపోవడంతో పాటు నగరిలో పరిస్థితులు ఆమెను మంత్రి పదవికి దూరం చేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు రోజా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఏపీఐఐసీ చైర్మన్ అయిన తర్వాత రోజా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. గతంలో రోజా నియోజక వర్గాన్ని పట్టించుకోకుండా టీవీ షోల మీద ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శలూ ఉన్నాయి. ఇకపై ఆ ముద్ర లేకుండా పూర్తిగా నియోజకవర్గానికి ప్రయార్టీ ఇవ్వాలని రోజా నిర్ణయించుకున్నారు. అందుకే ఇకపై కొత్త షోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నగరిలోనే రోజా ఇల్లుకట్టుకున్నారు. ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీనితో విస్తరణలో అయిన బెర్తు సంపాదించాలనే లక్ష్యంతో రోజా ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రోజా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి అందులో విజయం సాధిస్తారో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu