రేసుగుర్రం నుండి వెళ్ళిపోయిన శృతిహాసన్

 

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ అమ్మడు షూటింగ్ పూర్తి చేసుకొని ముంబాయి కి వెళ్ళిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శృతి ఒక పాట కూడా పాడింది. ఇందులో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu