కాన్స్ ఫెస్టివల్ కి షెర్లిన్ కామసూత్ర
posted on Nov 12, 2012 2:49PM

ప్లేబాయ్ మ్యాగజైన్ కి పూర్తి నగ్నంగా ఫోజులిచ్చిన తొలి ఇండియన్ మోడల్ షెర్లిన్ చోప్రా. శృంగారం అంటే ఎందుకంత సిగ్గుపడతారంటూ ఓపెన్ గా మాట్లాడే ఈ మోడల్ లేటెస్ట్ గా కామసూత్ర మూవీలో తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తోంది. రూపేష్ పాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ త్రీడీ సినిమా ప్రీమియర్ ని వచ్చే ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాలని కమిటీ నిర్ణయించింది.
షెర్లిన్ చోప్రా పూర్తిగా నగ్నంగా నటించే సీన్స్ ని విదేశాల్లో తీయాలని రూపేష్ అనుకుంటున్నాడు. హాలీవుడ్ స్టూడియోలో రసవత్తరమైన సన్నివేశాల చిత్రీకరణకు ఆగమేఘాలమీద ఏర్పాట్లు జరుగుతున్నాయ్. సెయింట్ డ్రాకులా అనే త్రీడీ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్ గా మారిన పాల్.. ఈసారి కామసూత్ర సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఉన్నాడు.