వైసీపీలోకి మంత్రి శత్రుచర్ల?

 

 

 

విజయనగరానికి చెందిన మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీ మారే విషయమై తీవ్రంగా తర్జనభర్జనలు పడుతున్న మంత్రి... ఎట్టకేలకు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారని సన్నిహితులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కార్యకర్తలతో సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.