శశికపూర్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్‌కి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. భారతీయ చలనచిత్ర రంగంలో నటుడిగా, నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శశి కపూర్ మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. ఈయన పృథ్విరాజ్ కపూర్ తనయుడు, రాజ్‌కపూర్ సోదరుడు. శశి కపూర్ కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పని చేశాడు. 2011లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఇప్పుడు ఆయన్ని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. శశి కపూర్ నాలుగు సంవత్సరాల వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ ‌లో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించారు.1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి కమర్షియల్ చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండటంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1950లో వచ్చిన సంగ్రామ్ చిత్రంలో అశోక్ కుమార్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. 1948-54 మధ్యలో నాలుగు హిందీ చిత్రాలలో నటించాడు. శశికపూర్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం పట్ల హిందీ సినిమా రంగంలో సంతోషం వ్యకమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu