ఈ 7వ్యాధులు సైలెంట్ గా శరీరాన్ని మృత్యువు ఒడిలో పడేస్తాయి!

ప్రతి వ్యాధికి ఏవో కొన్ని లక్షణాలు ఉండనే ఉంటాయి. చాలావరకు ఈ లక్షణాల ఆధారంగా జబ్బును ముందుగానే తెలుసుకుని చికిత్స చేయించుకుని ఆర్థిక, ప్రాణ నష్టాన్ని తగ్గించుకుంటు ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలేవీ లేకుండా శరీరంలోకి చాపకింద నీరులా ప్రవేశించి సైలెంట్ గా ప్రాణాలను కబళించే  జబ్బులు ఉంటాయి. ఇవి తీవ్రమైన స్థాయికి వెళితే తప్ప బయటపడవు.  ఇవి చాలా ప్రాణాంతకమైనవిగా పరిగణించబడతాయి. ఇలాంటి 7 జబ్బుల గురించి గురించి తెలుసుకుంటే..

మధుమేహం..

తీపి పదార్థాల మీదా, బయటి ఆహారాల మీద మోహం కాస్తా మధుమేహానికి దారితీస్తుంది. ఇది నయం చేయలేని వ్యాధి, దీని కారణంగా మూత్రపిండాలు, గుండె తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రపంచంలో చాలా మంది  ప్రీ-డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. వీరికి తమకు మధుమేహా వ్యాధి ప్రారంభమైందనే విషయం అస్సలు తెలియదు. ఈ వ్యాధికి  ప్రారంభ లక్షణాలు ఏంటనేవి కూడా ఇప్పటివరకు ఎెవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో మధుమేహం వచ్చింది అని ఎప్పుడో శరీరానికి నష్టం కలిగిన సమయంలో బయటపడుతూ ఉంటుందే తప్ప ముందస్తు లక్షణాలతో దీన్ని గుర్తించలేము. గుర్తించిన తరువాత దీన్ని నయం చేయలేము.

అధిక కోలెస్ఠ్రాల్..

శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలు. నిపుణులు హెచ్‌డిఎల్‌ను మంచి కొలెస్ట్రాల్ గా, ఎల్‌డిఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ గా అభివర్ణించారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఎలాంటి ప్రత్యేక సంకేతాలను కలిగి ఉండదు.  ఈ కారణంగా ఇది గుండె సంబంధ సమస్యలను, ఇతర శారీరక అనారోగ్యాలను పెంచుతుంది. ఇది ప్రాణాంతకంగా  మారుతుంది.  రెగులర్ గా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే ఈ సమస్య పెరగకుండా నియంత్రించగలదు.

ఫ్యాటీ లివర్..

కొలెస్ట్రాల్  ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం కుళ్లిపోతుంది. ఇది  చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో  రోగికి ఎలాంటి చిన్న క్లూ కూడా లభించదు. ఈ వ్యాధిని ఫ్యాటీ లివర్ వ్యాధి అంటారు . ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఇది తీవ్రరూపం దాలుస్తుంది. దీన్ని బట్టి ఇది మగవారిలో ఎక్కవగా వస్తుందని చెప్పుకోవచ్చు.

అధిక రక్తపోటు..

సిరలు కుంచించుకుపోవడం లేదా సిరలలో అడ్డంకి ఏర్పడటం  వల్ల రక్తం ప్రవహించే మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా గుండె మరింత ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా, రక్తపోటు పెరుగుతుంది.  గుండెపోటు  స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

బోలు  ఎముకల వ్యాధి..

ఈ వ్యాధి ఎముకలను బోలుగా చేస్తుంది. ఇది కాల్షియం,  విటమిన్ డి లోపం వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల చిన్న గాయం అయినా ఎముక విరిగిపోతుంది. ఇది ఎముకలను చాలా బలహీనం చేస్తుంది.  

క్యాన్సర్..

క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది  ఒక ప్రాణాంతక వ్యాధి, దీనిలో శరీరంలో ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతూ వెళుతుంది.  దీని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.  ఏదైనా పని చేసినప్పుడు అలసిపోయినట్టో, నీరసంగా అనిపించినట్టో ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే దీన్ని గుర్తించడం కష్టం. చేయి దాటిపోతే తప్ప ఈ వ్యాధి బయటపడదు. ఆ సందర్భంలో ఈ వ్యాధి భయంకరమైన లక్షణాలను బయటకే వ్యక్తం చేస్తుంది.

స్లీప్ ఆప్నియా..

ఇది నిద్రకు సంబంధించి ప్రాణాంతకమైన  జబ్బు. ఈ జబ్బులో శ్వాస ఆగిపోతుంది,  నిద్రలో స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. దీని రోగులు స్ట్రోక్,  ఆకస్మిక మరణానికి  గురయ్యే ప్రమాదం ఎక్కువ  ఉంది. ఇందులో పేషెంట్ కు వేగంగా గురక పెట్టే సమస్య కూడా ఉండొచ్చు.

                                                      *నిశ్శబ్ద.