మంత్రులు మాట మీద నిలబడతారా

 

Seemandhra ministers, congress ministers, ap ministers congress, seemandhra ministers

 

 

తెలంగాణ ఏర్పాటు పై సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరి కొందరు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ముందుగానే రాజీనామా చేస్తామన్న నేతలపై విమర్శలు వస్తున్నాయి.

 

గత కొద్ది రోజులుగా సమైక్యాంద్ర కోసం డిల్లీలో భారీ లాభియింగ్‌ నిర్వహించిన రాష్ట్రమంత్రులు తమ ఆకాంక్ష నెరవేరని పక్షంలో రాజీనామాలకు కూడా వెనుకాడమని అధిష్టానాన్ని హెచ్చరించారు. అయితే వీరి బెదిరింపులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు.

అనుకున్నట్టుగానే అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. అన్ని విషయాలపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అధిష్టానం నాలుగు నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా తేల్చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ మంత్రుల స్టెప్‌ ఏంటి.. ఇప్పటికే పలువురు ఏమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామ బాట పట్టగా ఇంతవరకు మాట ఇచ్చిన మంత్రులు మాత్రంనోరుమెదపలేదు.. దీని కారణం ఏంటి అన్న ఆగ్రహంలో ఉన్నారు సీమాంద్ర ప్రజానీకం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu