పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం
posted on Jul 13, 2025 11:39AM
.webp)
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో మరో ప్రమాదం జరిగింది. ఎన్విరోవేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. పరిశ్రమలో లారీ, జేసీబీకి మంటలు వ్యాపించాయి. సిగాచీ పరిశ్రమ మిగిల్చిన విషాదాన్ని మరవకముందే అదే పాశమైలారంలో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మృతదేహాలు గుర్తించిన సంగతి తెలిసిందే. మృతిచెందిన ఒక్కొక్కరికి కంపెనీ యాజమాన్యం రూ. కోటి పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.10 లక్షల సాయం చేస్తామని చెప్పింది. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.