సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు : గీతారెడ్డి

 

సెప్టెంబర్‌ 7న ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సభ వివాదాస్పదమవుతుండటంతో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ విషయం పై స్పందించిన రాష్ట్ర మంత్రి గీతారెడ్డి. ఎపి ఎన్జీవోలు సభ పెట్టుకోవచ్చన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగానే అంగీకరించాం. సభ పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు చెపుతామన్నారు.

శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకొవచ్చని చెప్పారు. అయితే శాంతి భద్రతల పరిస్థితిని బట్టి సభకు లభించటం లభించకపోవటం ఉంటుందన్నారు. గీతారెడ్డి నివాసంలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో తాజా పరిణామాలమై చర్చించిన నేతలు తరువాత మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు ఎంతో సమ్యనం పాటిస్తున్నారన్న ఆమె సీమాంద్ర నాయకులు, ప్రజలు విభజనకు సహకరించాలని కోరారు. సీడబ్ల్యూసిలో తీసుకున్న హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప వేరే దేనికి అంగీకరించబోమని ప్రకటించారు.