ఇంటి ఇల్లాలికీ ఇక జీతం ఇవ్వాల్సిందే

భర్తకూ, పిల్లలకూ వండిపెడుతూ, బండెడు చాకిరీని తన భుజాలపై మోస్తూ జీతం బత్తెం లేని ఉద్యోగం చేస్తున్న ఇంటి ఇల్లాలికి ఇక మంచి రోజులు రాబోతున్నాయి! ఇదే విషయాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మంత్రి కృష్ణా తీర్ధ్‌ చెబుతూ, ఇంటిఇల్లాలు చేసే బండెడు చాకిరీకి తగిన విలువను చెల్లించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నామన్నారు!ఇంటి ఇల్లాలి పని ఒత్తిడ, ఆర్థిక స్వాతంత్య్రం పై ఇటీవల సర్వే నిర్వహించామనీ, ఆ సర్వేలో అత్యధిశాతం మందిమహిళలు ఆర్థిక స్వేచ్ఛ లేనట్లుగా పేర్కొన్నారనీ ఆయనన్నారు. ఇంటి ఇల్లాలికి నెల నెలా భర్త జీతం చెల్లించాలన్న ప్రతిపాదన హర్షనీయమే అయినప్పటికీ, ఎవరెవరికి ఎంత చెల్లించాలన్న దానిపై స్పష్టత కోసం అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. ఇంటి పనంతా ఇల్లాలిపై వేసి ఆమె చేత చాకిరీ చేయించు కోవడమే కాకుండా, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అంటూ అధికారం చెలాయించే మగమహారాజులు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో మరి!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu