గోరంట్ల వ్యవహారం సీరియస్ కాదా సజ్జలా?.. అది ప్రైవేటు వ్యవహారమా సలహాదారూ!

లోకం చీద‌రించుకునే ప‌ని చేసిన‌వాడిని పంచ‌న‌బెట్టుకుని అబ్బే మావాడు కాదు అదంతా మార్షింగ్ వ్య‌వ హారమ‌ని  అడ్డంగా వాదించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ స‌ల‌హా దారు, వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట కూడా అలానే వుంది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ లీల‌లు  వీడియోలో అంద‌రూ చూసి ప్ర‌శ్నిస్తుంటే ఇదేమీ సీరియ‌స్ సంగతి కాద‌ని ఆయ‌న అన‌డం విడ్డూరం. పైగా అది క‌ల్పిత వ్య‌వ‌హార‌మ‌ని అస‌లు అందులో ఉన్న‌ది గోరంట్లేన‌ని నిరూ పించాల్సిన బాధ్య‌త ఆరోపించ‌న‌వారిమీద‌నే ఉంద‌ని స‌జ్జ‌ల సెల‌విచ్చారు. త‌న వారిని కాపాడు కోవ‌డానికి ఎంత చెత్త ప‌న‌యినా పెద్ద‌గా ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌న్న‌పుడు ఎప్పుడో జ‌రిగిన రేవంత్ రెడ్డి వ్య‌వ హారం తెర మీద‌కి  ఎందుకు తీసుకువ‌చ్చారని టీడీపీ ఆరోపిస్తోంది.

తాడేప‌ల్లి వైసీపీ కార్యాల‌యంలో స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ, గోరంట్ల‌ది నాలుగ్గోడ‌ల మ‌ధ్యది, ప్రైవే టు వ్య‌వ‌హారమ‌ని పోలీసులు ఇంకా ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని అంద‌రూ నోరు పారేసుకోవ‌డం స‌బ‌బు కాద‌న్నా రు. వీడియోలో మార్ఫింగ్ జ‌రిగింద‌ని, అది తాను కాద‌ని గోరంట్లే అంటున్న‌పుడు దాన్ని గురించి రుజువు చేయాల్సింది ఆరోపించిన‌వారి బాధ్య‌త‌గా స‌జ్జ‌ల పేర్కొన‌డం మ‌రీ విడ్డూరం. త‌మ ఎంపీ అడ్డంగా దొరికి పోవడంతో స‌జ్జ‌ల 2015 నాటి సంగ‌తి ప్ర‌స్థావించి అస‌లు సంగ‌తి తెర‌మ‌రుగు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విశ్లేష‌కుల మాట‌.  

గోరంట్ల వీడియోపై విచార‌ణ‌లో మార్ఫింగ్ కాద‌ని తేలితే  త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, తొంద‌రే ముంద‌ని  తాపీగా ఇప్పుడు చెబుతున్నారు. ఇపుడు ప్ర‌జ‌లు, విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తుండ‌డంతో వైసీపీ నేత‌లు త‌మ త‌ప్పు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి, ఎంపీని ర‌క్షించుకునే మార్గాన్ని అనుస‌రించ‌డంతో విప‌క్షాల మీద ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తూ కాల‌యాప‌న చేయ‌డానికి పూనుకున్నార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. 

దీనికి తోడు వైసీపీ మ‌హిళా నేత‌లు కూడా గోరంట్ల వీడియో అంశాన్ని తేలిగ్గానే తీసుకున్న‌ట్టు క‌న‌ప‌డు తోంది. వాస్త‌వాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంద‌ని, పోలీసు ద‌ర్యాప్తు త‌ర్వాత‌నే వీడియో అస‌లా, న‌కిలీ అన్న‌ది బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఇటీవ‌ల  వైసీపీ మ‌హిళా నేత‌లు అన్నారు.  అయితే పార్టీ ప్రతిష్ట‌ను దెబ్బ తీసే సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు దాన్ని గురించి పార్టీ ప‌రంగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు తీసుకోకుండా గోరంట్ల వంటి వారిని వెన‌కేసుకు రావ‌డం పార్టీ ప‌రిస్థితిని, చర్యలకు భయపడుతున్న దుస్థితిని తెలియజేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.