అలకవీడిన జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి చర్యలు ఊహాతీతం అని మళ్ళీ రుజువైంది.. టీడీపీ, మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడం.. ఎంపీ జేసీ అవిశ్వాస తీర్మాన చర్చకు రానని ప్రకటించడం తెలిసిందే.. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో ఈ వ్యవహారం గురించి చర్చించారు.

 

 

అనంతపురంలో రోడ్డు విస్తరణ సందర్భంగా ప్రార్థనా మందిరాలను తొలగించాలని జేసీ పట్టుబడుతున్నారు.. ప్రార్థనా మందిరాలను తొలగించవద్దని ఆయా సామాజికవర్గాలు కోరుతున్నాయి.. ప్రార్థనామందిరాల కమిటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి.. ప్రభాకర్‌చౌదరే వాళ్లను కోర్టుకు పంపించారని దివాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.. ఇదే జేసీ అలకకు కారణమని తెలుస్తోంది.. అయితే ప్రభాకర్ తో చర్చలు అనంతరం చంద్రబాబు జేసీని అలక వీడేలా చేసారు.. అనంతపురంలో రహదారుల విస్తరణకు 45 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.. రోడ్ల విస్తరణ జీవోతో పంతం నెగ్గించుకున్న జేసీ అలకవీడి రేపు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం జేసీ ఏం చేస్తారో.