ఎన్డీయేకు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ గుడ్ బై

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ కూటమికి బీహార్ లో షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగింది.  ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి  పశుపతి కుమార్ పరాస్  అధికారికంగా ధృవీకరించారు.

గత పదేళ్లుగా ఎన్డీయే కూటమిలో ఉంటున్న రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ.. సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు కూటమి నుంచి వైదొలగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దళిత వ్యతిరేక వైఖరికి నిరసనగా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు పశుపతి కుమార్ పరాస్   ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu