వంగవీటి తరువాత వర్మ... బెజవాడలో కాలుపెట్టగలడా? 

 

వంగవీటి... వర్మ ఆడియన్స్ మీదకి వదులుతున్న లెటెస్ట్ మూవీ ఇది! ఇలాంటి సినిమాలు గతంలో ఆయన చేయలేదా? బోలెడు చేశాడు. శివ నుంచీ వీరప్పన్ వరకూ అన్నీ వయోలెంట్ మూవీసే. అలాగని వర్మ సినిమాల్లో కమర్షియల్ డిష్యుం డిష్యుం వుండదు. రియల్ బ్రెత్ టేకింగ్ వయోలెంట్ సీన్స్ వుంటాయి. కాని, ఇప్పుడు వస్తోన్న వంగవీటి అలాంటి సినిమాల్లో మరొకటి కాదు. ఎందుకంటారా? ఈ సినిమా రియల్ క్రైమ్ అండ్ పొలిటికల్ స్టోరీ కాబట్టి... 

వర్మ సత్య, కంపెనీ, రక్త చరిత్ర లాంటి చాలా సినిమాలు రియల్ లైఫ్ ఇన్ స్పిరేషన్ తో తీశాడు. కాని, వంగవీటిలో ఫస్ట్ టైం నేరుగా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని తెరపై చూపబోతున్నాడు. ఇంతకు ముందెప్పుడు ఆయన నిజ జీవిత మనుషులపై, నాయకులపై సినిమాలు తీయలేదు. తీసినా సినిమాలో వేరే పేర్లు, కొంచెం డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఎంచుకునేవాడు. కాని, వంగవీటితో గతంలో ఎప్పుడూ చేయని సాహసం చేస్తున్నాడు. ఒకవైపు వంగవీటి కుటుంబాన్ని, మరో వైపు దేవినేని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. అలాగే, రెండు వర్గాల అభిమానుల్ని కూడా గమనించుకుంటూ ముందుకు సాగాలి. ఎక్కడ తేడా వచ్చిన గందరగోళమే... 

విజయవాడ రాజకీయాలు, గతంలో అక్కడి రాజకీయాలు తెలిసిన వారందరికీ వంగవీటి, దేవినేని ఫ్యామిలీల రిలేషన్ కూడా తెలిసే వుంటుంది. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అప్పుడు, ఇప్పుడు కూడా. కాకపోతే, ఒకప్పుడు పరిస్థితులు దారుణంగా, హింసాత్మకంగా వుండేవి. ఆనాటి పరిస్థితుల్నే ఆర్జీవీ ఇప్పుడు తెరపై చూపించబోతున్నాడు. అదీ ఎగ్జాక్ట్ పేర్లు కూడా వాడుతున్నాడు సినిమాలో. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. రియల్ లైఫ్ స్టోరీ  అయినా వేరు పేర్లతో చెప్పేవాడు. మరి వంగవీటి సినిమాలో రియల్ నేమ్స్ అండ్ క్యారెక్టర్స్ వాడితే , దేవినేని, వంగవీటి అభిమానుల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ఎవ్వరికీ కోపాలు రాకుండా ఎలా చూపిస్తాడు? నిజ జీవిత నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు ఎవరో ఒకరిది తప్పని చూపక తప్పదు కదా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు ఇప్పుడు ఆడియన్స్ ని వేధిస్తున్నాయి. వంగవీటి సినిమా తెర మీద కనిపిస్తేనే మనకు ఈ ప్రశ్నలకు జవాబులు దొరికేది! అలాగే, రామూ భవిష్యత్ లో తాను పుట్టిన ఊరైన విజయవాడకి హ్యాపీగా వచ్చిపోగలడా అని కూడా క్లారిటీ వస్తోంది!


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu