ఐఏఎస్ అక్రమాలపై రేవంత్ గురి 

ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం రెరా బాలక‌ృష్ణుడు అస్సలు నోరు విప్పడం లేదట…   
కరెంటు కొనుగోళ్ల లో బోలెడు అక్రమాల‌కు పాల్ప‌డిన‌ కరెంటు ప్రభాకరరావు ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే ఇక… సింగరేణి బాగోతాలన్నింటికీ బాధ్యుడైన సింగరేణి శ్రీధర్ తప్పించుకున్నట్టే.  
వేలాది మంది నిరుద్యోగులను నిలువునా మోసగించిన టీఎస్పీఎస్సీ జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నట్టే. హెటెరో పార్థసారథి వంటి వేల కోట్ల మేతగాళ్లు ఎందరో వున్నారు. 
మెల్లిమెల్లిగా కాళేశ్వరం, ధరణి వంటి అన్ని బాగోతాల అధికారులు, ఇంజినీర్లూ తప్పించుకుంటారు.  సోమేష్ అండ్ కో బీహార్ బ్యాచ్‌ను రక్షించడానికి ఎన్ని మార్గాలు లేవంటూ తెలంగాణా జ‌నం చెప్పుకుంటున్నారు. ఈ నయా నయీంల వేట రేవంత్ వల్ల కూడా కావ‌డం లేదు. వీళ్లు నయీంకన్నా ఏం తక్కువ..? తను చేయాల్సిందేదో స్ట్రెయిట్‌గా చేశాడు… కానీ వీళ్లు..?...
ప్రభుత్వమే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే. వసూళ్ల దందాకు దిగితే. సామాన్యుడి సంగతి దేవుడెరుగు. కార్పొరేట్ మాఫియాని,  ఐఏఎస్ అధికారుల్ని త‌న గుప్ప‌ట్లో పెట్టుకొని దొర పాల‌న సాగింది.
అధికార పార్టీ పెద్దలు కూడా ఈ మేతగాళ్ల బాగోతాల్లో భాగస్వాములు కాబట్టి వీళ్ల అక్రమాలు అలా నడుస్తూ పోయాయి… రిటైరవుతారు, అవే పోస్టులో లేదా సలహాదారుల పాత్రల్లో అలాగే అధికారాలతో కొనసాగారు.
సగటు ఉద్యోగులకు కనీసం ఏసీబీ భయం… విజిలెన్స్ భయం, కటకటాల భయం… 
వీళ్లకు సీబీఐ భయం కూడా లేదు… 
దానికి అంత సిబ్బందీ లేదు… 
వీళ్లపై నిఘాలు వేసి ఎప్పటికప్పుడు అక్రమార్కులను ఏరేయాల్సిన డీవోపీటీ మన వ్యవస్థలో అది పెద్ద ఫెయిల్యూర్… దానంత మోస్ట్ హోప్‌లెస్ విభాగం మరొకటి లేదు.
నిజానికి ఐఏఎస్ ఎంపికే పెద్ద లోపభూయిష్టం… 
వాళ్లకు శిక్షణ కూడా అంతే… 
వీళ్లేమో కొంత మంది కొలువులో చేరింది మొదలు సొసైటీని కుళ్లబొడుస్తుంటారు… 
నిజానికి మన భారతీయ సమాజానికి అసలు సిసలు శత్రువులు కొంత మంది సివిల్ సర్వీసు అధికారులే… 
బోలెడు ఉదాహరణలు… 
ఇక అధికార పార్టీ మద్దతు కూడా తోడైతే… ఇంకేముంది..?  
1.
కరెంటు ప్రభాకరరావు ఏం చేశారో చూడండి.
కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ 3 ప్రాజెక్టులకు రూ.45,730 కోట్ల అంచనా వ్యయంతో గతంలో టెండర్లు పిలిచారని.. ఇందులో 30 శాతం కమీషన్‌ రూపంలో అవినీతి చోటుచేసుకుంది. 
ఏటా రూ.16 వేల కోట్లతో వ్యవసాయానికి కరెంటు కొన్నట్లు చూపించి రూ.8 వేల కోట్లు దోచుకుంటున్నారు.
తెలంగాణ లో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. విద్యుత్ డిస్కం సంస్థలు రూ.62,461కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయన్నారు. 2023 అక్టోబర్ నాటికి విద్యుత్ సంస్థలకు మొత్తం రూ. 81,516కోట్లు అప్పులు. 

2.
ఇక 
సింగరేణి శ్రీధర్  మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. కేంద్రం వద్దన్నా తొమ్మిదేండ్ల పాటు ఆయన సింగరేణి సీఎండిగా కొనసాగారు. 
శ్రీధర్ పదవీ కాలంలో సింగరేణిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సంస్థకు చెందిన రూ. వేల కోట్ల డీఎంఎఫ్ టీ నిధులను దారి మళ్లించారనే విమర్శలు వచ్చాయి. 
పోస్టులను అమ్ముకున్నారు.
ప్రతి మెడిక‌ల్ బోర్డు మీటింగ్‌లో కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
బొగ్గు బ్లాక్‌ల వేలంలో సైతం ఆయ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవహరించారు.
కోట్లాది రూపాయల కుంభకోణాలు జ‌రిగినా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యాడు.  

3.
టీఎస్పీఎస్సీ జనార్దన్‌రెడ్డి అక్ర‌మాల గురించి పేప‌ర్ లీకేజ్‌ల‌తో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడి త‌న ఆస్థులు పెంచుకున్నాడు.

4.
క‌రోనా స‌మ‌యంలో కూడా అమానుషంగా వ్య‌వ‌హ‌రించి రెమిడిసివిర్ ఇంజెక్షన్  లక్ష రూపాయ‌ల‌కు అమ్మారు.  పార్థసారథి ఫార్మా స్కాం పై ప్ర‌తిప‌క్షాలు శాప‌నార్థాలు పెట్టాయి. అయితే అప్ప‌ట్టి సి.ఎం. కేసీఆర్‌ పార్థసారథికి రాజ్యసభ టికెట్ ఇచ్చి త‌ల‌మీద పెట్టుకున్నారు.
5.
క‌ళాశ్వ‌రంలో కాంట్రాక్ట‌ర్లు, మెగా రెడ్డి,
ధ‌ర‌ణిలో బీహార్ బ్యాచ్ అధికారులు ద‌ర్జాగా తిరుగుతున్నారు.

తొమ్మిందేండ్ల కాలంలో జరిగిన అవినీతి కుంభకోణాల పై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.  రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో తెలంగాణ‌కు రూ. 16 వేల కోట్ల మిగులు బ‌డ్జెట్ ఉండేది. ఇవాళ రాష్ట్ర అప్పు 5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu